Telugu Daily News
ప్రతిభ కలిగిన 10 మంది విద్యార్థులకు ప్రోత్సాహకాలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : గత ఏడాది హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో పదవ తరగతి లో 500 మార్కులు పైన సాధించిన 10 మంది పిల్లలకు డిటిఎఫ్ రాష్ట్ర నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పదివేల రూపాయలను శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలికల పాఠశాల హెచ్ఎం బొరగాల తిరుమల, ఆసియా, స్వామి రావు, అర్చన, రోజారాణి, మాధవిలత, శోభారాణి , శ్రీలత, నందం, రాజు, పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతి ఏడాది హుజురాబాద్ జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో ఎంతమంది పిల్లలు 500 మార్కులకు పైగా సాధిస్తే వారికి డబ్బులు అందిస్తానని తెలిపారు.

