Social 1080×1350 • Multi-page
10-10-2026 BREAKING NEWS 12:02 AM
swarnodayam.com
Telugu Daily News

ధర్మరాజుపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా ‘పోషణ మాస’ ముగింపు వేడుకలు

ధర్మరాజుపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా ‘పోషణ మాస’ ముగింపు వేడుకలు
IMG-20261010-WA0000

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (ధర్మరాజుపల్లి): గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ‘పోషణ మాస’ (పోషణ్ మాహ్) కార్యక్రమ ముగింపు వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు శ్రీమంతాలు, చిన్న పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ముందస్తు బతుకమ్మ వేడుకలను అత్యంత కోలాహలంగా జరుపుకున్నారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ శ్రీమతి కందాల శ్రీలత హాజరయ్యారు. ఐసిడిఎస్ (ICDS) సూపర్‌వైజర్ జ్యోతి, గ్రామ సెక్రటరీ స్వప్న, హెచ్‌ఎం శ్రీనివాస్, ఏఎన్‌ఎం సుమలత, అంగన్వాడీ టీచర్ రాధ, ఆశా కార్యకర్త అన్నపూర్ణతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.

​పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన:

ఈ సందర్భంగా ఐసిడిఎస్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ… తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు పోషకాహారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గర్భిణులు, బాలింతలు మరియు చిన్న పిల్లలకు అందించే పౌష్టికాహార ప్రాముఖ్యతను వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

​అలరించిన బతుకమ్మ సంబరాలు:

పోషణ మాసం ముగింపు సభ అనంతరం అంగన్వాడీ కేంద్రం ఆవరణలో తల్లులు, మహిళలు, పిల్లలతో కలిసి ముందస్తు బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. పూలతో బతుకమ్మలను అలంకరించి, ఆటపాటలతో ప్రాంగణమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లులు, చిన్నారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!