నేడు 11 గంటలకు హక్కులనేత బాలగోపాల్ 17వ సంస్మరణ సభ.. – అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయండి.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మాన హక్కుల వేదిక, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ 11 ఆదివారం రోజున (నేడు) హుజురాబాద్ విఎల్ఆర్ ఫంక్షన్ హాల్ ( హుజూరాబాద్ క్లబ్)లో జరిగే హక్కుల నాయకుడు బాలగోపాల్ 17వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని నిర్వాహకులు ఒక సంయుక్త పత్రికా ప్రకటన లో విజ్ఞప్తి చేశారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే ఈ సభకు ప్రధాన వక్తగా ఛత్తీస్ గడ్ హై కోర్టు న్యాయవాది, సామాజిక, హక్కుల కార్యకర్త బేలా భాటియా హాజరుకానున్నారు.

నేటి సందర్భానికి బాలగోపాల్ హక్కుల దృక్పథంపై మానవ హక్కుల వేదిక, దళిత, ప్రజా సంఘాల నాయకుల సందేశాలు వుంటాయని వారు పేర్కొన్నారు.
ప్రజాస్వామిక వాదులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ ఎస్ తిరుపతయ్య, న్యాయవాది, టీజెఎస్ రాష్ట్ర నాయకులు ముక్కెర రాజు, భారత్ బచావో నాయకులు భీమోజు సదానందం, పొడిశెట్టి వెంకట్రాజం,
రచయిత ఇమ్మడి సంపత్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ ఆవునూరు సమ్మయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు,డిటీఫ్ నాయకులు పి.ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు గుంటి సామ్రాజ్యం, ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి అధ్యక్షులు రామంచ భరత్, తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య నాయకులు బాబ్జీ, ఆర్టీసీ నాయకులు శివదయాల్ సింగ్, మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్ పిలుపునిచ్చారు.

