హుజురాబాద్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు – మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని పరిశీలన

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని, హుజురాబాద్ పట్టణంలో జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని సోమవారం స్వయంగా పరిశీలించారు. పట్టణంలోని బతుకమ్మ ఆడే ప్రధాన స్థలాలను సందర్శించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పండుగకు విచ్చేసే ప్రతి మహిళకూ అన్ని సౌకర్యాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని చైర్‌పర్సన్ కోరారు.



పరిశుభ్రతకు పెద్ద పీట: మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బతుకమ్మ వేదికలను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
నీటి వసతి, నిమజ్జనం: వేడుకలు ముగిసిన తర్వాత పూల బతుకమ్మలను గౌరవప్రదంగా నిమజ్జనం చేసే ప్రాంతాన్ని సురక్షితంగా మరియు శుభ్రంగా ఉంచాలని సూచించారు.
వెలుతురు ఏర్పాట్లు: సాయంత్రం వేళల్లో బతుకమ్మ ఆడేందుకు వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవసరమైన అన్ని ప్రాంతాల్లోనూ మెరుగైన వీధి దీపాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.


ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మేకల తిరుపతి, కౌన్సిలర్లు సొల్లు సునీత బాబు, నాంపల్లి శ్రీనివాస్, వడ్డేపల్లి వెంకటేశ్వర్లు, జున్నోజు భాస్కర్, చందమల్ల పుణ్య బాబు, ఏఈ నరేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిరణ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ వినయ్, జవాన్లు ప్రతాప రాజు, ఆరెల్లి రమేష్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ పంజాల మనోజ్ (బంటి) గారు, 21వ వార్డ్ కౌన్సిలర్, బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ హుజురాబాద్ పురపాలక సంఘం.

