Social 1080×1350 • Multi-page
12-10-2026 BREAKING NEWS 09:08 PM
swarnodayam.com
Telugu Daily News

పీఆర్సీ కమిషన్ గడువు పెంపు ఆలోచనను సర్కార్ వెంటనే విరమించుకోవాలి : మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్

పీఆర్సీ కమిషన్ గడువు పెంపు ఆలోచనను సర్కార్ వెంటనే విరమించుకోవాలి : మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్
IMG-20261012-WA0083

స్వర్ణోదయం ప్రతినిధి ​హైదరాబాద్:
పీఆర్సీ కమిషన్ గడువును మరోసారి పొడిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలపై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు మరియు విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడువు పెంపు ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పీఆర్సీ మంజూరు కావాల్సిన గడువు ముగిసి ఇప్పటికే 39 నెలలు దాటిపోయిందని, ఇకనైనా ఉద్యోగుల సహనాన్ని పరీక్షించకుండా వెంటనే పీఆర్సీ కమిషన్ నివేదికను తెప్పించుకుని అమలు చేయాలని స్పష్టం చేశారు.

​అరకొర నిర్ణయాలతో స్వీయ సంతృప్తి తగదు
​ఒకటవ తేదీన జీతాలు ఇవ్వడం, కాలానుగుణంగా వచ్చే డి.ఏ (DA)లలో కేవలం రెండింటిని (ఒకటి 33 వాయిదాలు, మరొకటి 27 వాయిదాలతో) మంజూరు చేసి, ఉద్యోగులకు ఏదో పెద్ద మేలు చేశామని ప్రభుత్వంలోని కొందరు పెద్దలు భావించడం వారి భ్రమ మాత్రమేనని ముజాహిద్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. ఐదు డి.ఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రెండు డి.ఏలతో ఉద్యోగులు, పెన్షనర్లు ఎవరూ సంతోషంగా లేరని, ప్రతి ఒక్కరూ కొత్త పీఆర్సీ ప్రకటన కోసమే కాచుకుని కూర్చున్నారని అన్నారు.
​రాబోయే ఎన్నికల్లో ఓట్లే కీలకం
​రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ ఎన్నికలు, ఖైరతాబాద్ అసెంబ్లీ మధ్యంతర ఎన్నికలతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల ఓట్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ముజాహిద్ హుస్సేన్ గుర్తుచేశారు. ప్రభుత్వానికి సానుకూల ఫలితాలు రావలంటే ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పీఆర్సీ నివేదికను తెప్పించి అమలు చేయాలని కోరారు.
​ప్రధాన డిమాండ్లు:
​పీఆర్సీ రిపోర్టును వెంటనే తెప్పించుకుని 51% ఫిట్‌మెంట్‌తో నూతన వేతన సవరణను అమలు చేయాలి.
​పెండింగ్‌లో ఉన్న మూడు (3) డీఏలను తక్షణమే విడుదల చేయాలి.
​రిటైర్డు ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలి.
​సి.పి.ఎస్ (CPS) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి.
​ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి డిపెండెంట్లకు ఎలాంటి షరతులు లేకుండా అన్ని ఎంపానెల్డ్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందేలా హెల్త్ కార్డులను అమలు చేయాలనీ అన్నారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ పంజాల మనోజ్ (బంటి) గారు, 21వ వార్డ్ కౌన్సిలర్, బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ హుజురాబాద్ పురపాలక సంఘం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!