Social 1080×1350 • Multi-page
12-10-2026 BREAKING NEWS 09:49 PM
swarnodayam.com
Telugu Daily News

రైతులకు కరెంటు, నీళ్లు వెంటనే అందించాలి. -ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్

రైతులకు కరెంటు, నీళ్లు వెంటనే అందించాలి. -ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : వ్యవసాయానికి కావలసిన విద్యుత్తు, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు ప్రభుత్వం అందించాలని కోరుతూ సోమవారం హుజూరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఎంపీడీవో తూర్పాటి సునీతకు పలువురు నాయకులు దరఖాస్తు అందించారు.

అనంతరం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, సామాజికవేత్త కౌన్సిలర్ వర్దినేని రవీందర్రావు, రాజపల్లి సర్పంచ్ కట్కూరి మల్లారెడ్డి లు మాట్లాడుతూ….ఎన్లినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు ముందస్తుగా హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. వర్షాభావంతో సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో ఎండిపోతున్నాయని, ఎల్ఎండి కింద ఆయకట్టుకు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని లిఫ్ట్ చేయాల్సిన ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే భయంతో రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని అన్నారు .ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఒక తడి కోసం నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని కోరారు. అలాగే 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో రెప్పపాటు విద్యుత్ సరఫరా అంతరాయం వాటిల్లని సంగతి గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి సాయి,
బెదరకోట రవీందర్, బత్తుల సమ్మయ్య, పోతుల సంజీవ్, బెదరకోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


**లోకల్ యాడ్స్**

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ పంజాల మనోజ్ (బంటి) గారు, 21వ వార్డ్ కౌన్సిలర్, బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ హుజురాబాద్ పురపాలక సంఘం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!