Social 1080×1350 • Multi-page
14-10-2026 BREAKING NEWS 06:54 PM
swarnodayam.com
Telugu Daily News

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వెలిచాల రాజేందర్‌రావు భేటీ

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వెలిచాల రాజేందర్‌రావు భేటీ
Oplus_16908288

—కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ

—వివిధ అంశాలపై చర్చించిన వెలిచాల రాజేందర్ రావు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ :కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ఢిల్లీలో బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను, ఉత్తరప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్,
సహురాన్ పూర్ లోక్‌సభ సభ్యుడు ఇమ్రాన్ మసూద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరిస్తున్న కార్యాచరణ గురించి మల్లికార్జున ఖర్గేకు రాజేందర్‌రావు వివరించారు.

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం క్షేత్రస్థాయిలో చేపట్టిన కార్యక్రమాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ నిర్వహించిన అంశాల గురించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వివరించారు. అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించేందుకు కృషి చేశానని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.

—పార్టీ శ్రేణులకు నిరంతరం అందుబాటులో..

కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని రాజేందర్‌రావు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు.

—ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చర్యలు..

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన పేదలకు చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాజేందర్‌రావు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనాలు అందేలా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని మల్లికార్జున ఖర్గేకు వివరించారు.

కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెలిచాల రాజేందర్‌రావు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో కరీంనగర్ నియోజకవర్గంలో మరింత కష్టపడి పని చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతతో పాటు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచనలు చేశారని రాజేందర్ రావు తెలిపారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శ్రీమతి ఆలేటి సుశీల గారు, కో ఆప్షన్ సభ్యురాలు హుజురాబాద్ పురపాలక సంఘం, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!