Social 1080×1350 • Multi-page
14-10-2026 BREAKING NEWS 07:26 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ‘బతుకమ్మ’ సంబరాలు

హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ‘బతుకమ్మ’ సంబరాలు
IMG-20261014-WA0170

​–తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక : చైర్‌పర్సన్ సుహాసిని

—అంగరంగ వైభవంగా పాల్గొన్న మహిళలు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది

​మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ ‘బతుకమ్మ’ సంబరాలు హుజురాబాద్ పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి సుహాసినీ రొంటాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు.

​ఈ సందర్భంగా చైర్‌పర్సన్ శ్రీమతి సుహాసిని రోంటాల మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, మన సాంస్కృతిక వైభవానికి నిదర్శనమని పేర్కొన్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ, ఈ పండుగను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

​రంగురంగుల పువ్వులతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు, ప్రజాప్రతినిధులు చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలాడుతూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలను జరుపుకున్నారు.

​ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ మేనేజర్ R. భూపాల్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, మెప్మా TMC మల్లేశ్వరి, CLRP రమాదేవి, స్వరూప, TLF RP అనూషతో పాటు OBలు, RPలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు విశేషంగా పాల్గొన్నారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శ్రీమతి ఆలేటి సుశీల గారు, కో ఆప్షన్ సభ్యురాలు హుజురాబాద్ పురపాలక సంఘం, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!