హుజురాబాద్లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.. – హాజరైన ఇంచార్జి వొడితల ప్రణవ్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తోందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు. హుజురాబాద్ పట్టణ పరిధిలోని 29వ వార్డులో తూముల సుజాతకు మంజూరైన నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు ప్రణవ్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ, ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ చేపట్టి అర్హులకు అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నో ఏళ్ల తమ కల నెరవేర్చినందుకు ప్రభుత్వానికి, ఇంచార్జి వొడితల ప్రణవ్కు లబ్ధిదారురాలు సుజాత కుటుంబం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రోంటాల సుహాసిని, స్థానిక కౌన్సిలర్ బోరగాల మొగిలి, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శ్రీమతి ఆలేటి సుశీల గారు, కో ఆప్షన్ సభ్యురాలు హుజురాబాద్ పురపాలక సంఘం, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు.

