Social 1080×1350 • Multi-page
14-10-2026 BREAKING NEWS 09:28 PM
swarnodayam.com
Telugu Daily News

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి..! దీనికి మంద కృష్ణ మాదిగ మద్దతు. – ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి..

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి..! దీనికి మంద కృష్ణ మాదిగ మద్దతు. – ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి..
IMG-20261014-WA0195

—అన్ని వర్గాల పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలి.!!

–ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల అమలు ఉద్యమానికి
ఓసీ జేఏసీ, బహుజన కుల సంఘాల సంపూర్ణ మద్దతు..

—అన్ని సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనానికి చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి.

—ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి…

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కుల మతాలకతీతంగా ఆర్ధిక ప్రాతిపదిక అన్ని వర్గాల పేదలకు విద్యా, ఉద్యోగ,ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించడమే ద్యేయంగా ఉద్యమం చేపడుతున్నామని, ఓసీ ఐకాస, ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల సాధన ఉద్యమ కమిటీ నాయకులు తెలిపారు.

కుల, మత ప్రాతిపదికన అమలవుతున్న ప్రస్తుత రిజర్వేషన్ విధానానికి ప్రత్యామ్నాయంగా అన్ని సామాజిక వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించి సమన్యాయం జరపాలని ఇందు కు కేంద్రం ప్రత్యేక చట్టం తేవాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి,ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల సాధన రాష్ట్ర కో. ఆర్డినేటర్ సంధి తిరుపతిరెడ్డి లు ప్రభుత్వాన్ని కోరారు.
బుధవారం హుజురాబాద్ లో సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల సాధన ఉద్యమ కో ఆర్డినేషన్ కమిటీ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు
పోరెడ్డి శంతన్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి జిల్లా, రాష్ట్ర ఓసీ ఐకాస ప్రతినిధులు, వివిధ సామాజిక వర్గాల సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.

ఏ సామాజిక వర్గానికీ, మతానికీ తాము వ్యతిరేకం కాదని, కుల–మతాలకు అతీతంగా అన్ని వర్గాల్లోని పేదలకు సమాన అవకాశాలు లభించాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ ఆరోరా ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్ నుంచి చేపట్టిన దేశవ్యాప్త రథ యాత్ర కు ఓసీ జేఏసీ, బహుజన కుల సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ లో ఈనెల 24 న ఆదిలాబాద్ లో ప్రవేశించి 26 న జనగామ, హన్మకొండ మీదుగా పరకాల కు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుందని ఈ సందర్బంగా పరకాల లో ఓసీ జేఏసీ, బహుజన కుల సంఘాల ఆధ్వర్యంలో 26 న సాయంత్రం 5గంటలకు పార్టీల కతీతంగా 50 వేల మంది తో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ కు హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు.

ప్రస్తుత రిజర్వేషన్ విధానంలో క్రిమిలేయర్ నిబంధనల అమలు లేకపోవడం తో రిజర్వేషన్ల ప్రయోజనాలు ఇప్పటికే పొందిన కుటుంబాలకే ప్రయోజనాలు పునరావృతమవుతున్నాయనే వాదనల నేపథ్యంలో, అర్హులైన ఇతర పేదలకు న్యాయం జరగాలన్నారు.
ఈ నేపథ్యంలో ఓసీ వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన తరహాలోనే, అన్ని సామాజిక వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి సమాన అవకాశాలు కల్పించే విధంగా ఆర్థిక స్థితిగతుల ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని రూపొందించాలని వారు కోరారు.

ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. అవసరమైతే రాజ్యాంగ సవరణపై పార్లమెంట్‌లో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని పోలాడి రామారావు,గోపు జైపాల్ రెడ్డి ల తో పాటు అధ్యత వహించిన పోరెడ్డి శంతన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల ఉద్యమ బహిరంగ సభ గోడ ప్రతులను నాయకులుఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం రాష్ట్ర కో ఆర్డినేటర్ సంధి తిరుపతిరెడ్డి, ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
చందుపట్ల నర్సింహ్మారెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, ఎడవెల్లి కొండాల్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు తాటికొండ ప్రభావతిరెడ్డి, రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల జేఏసీ కన్వీనర్ విష్ణుదాసు గోపాలరావు, ఉమ్మడి జిల్లా ఆర్య వైశ్య సబఘాల నేత తాటిపల్లి రాజన్న, ప్రోగ్రాం సోషల్ మీడియా కన్వీనర్ రావుల కిరణ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు వర్ధినేని రవీందర్ రావు, పిల్లా వెంకట్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కే హరి ప్రసాద్, బిసి సంఘాల రాష్ట్ర కార్యదర్శి బచ్చు ఆనందం,దళితసంఘాల డివిజన్ నాయకులు వేల్పుల రత్నం, బత్తుల రాయలింగు నాయకులు కంకనాల జనార్దన్ రెడ్డి, ఏనుగు చొక్కా రెడ్డి, గూడూరి స్వామి రెడ్డి, బజాజ్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. ఓసీ జేఏసీ జాతీయ నేతలు ఆయనను కలసి తమ వంతు మద్దతు కోరగా ఆయన మద్దతును తెలిపినట్లు ఓసి జేఏసీ నేతలు తెలిపారు. పద్మశ్రీ అవార్డు పొందిన సందర్భంగా ఆయనను ఓసీ జేఏసీ నేతలు ఘనంగా సత్కరించారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శ్రీమతి ఆలేటి సుశీల గారు, కో ఆప్షన్ సభ్యురాలు హుజురాబాద్ పురపాలక సంఘం, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!