Social 1080×1350 • Multi-page
15-10-2026 BREAKING NEWS 03:23 PM
swarnodayam.com
Telugu Daily News

కలంపై పోలీసుల జులుం తగదు. – బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. -మాదిగ జర్నలిస్టు ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు టేకుల సాగర్ డిమాండ్

కలంపై పోలీసుల జులుం తగదు. – బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. -మాదిగ జర్నలిస్టు ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు టేకుల సాగర్ డిమాండ్
IMG-20261015-WA0058

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : జర్నలిస్టులపై దాడులు, పోలీసుల వేధింపులు అప్రజాస్వామికమని, వార్తలు రాసిన జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ జర్నలిస్టు ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు టేకుల సాగర్ డిమాండ్ చేశారు.
గంభీరావుపేట ఎస్సై వ్యవహార శైలిపై వార్తలు రాసిన ఏక్ దమ్ న్యూస్ జర్నలిస్టు సంపత్, ఎడిటర్ పొత్తూరి శేఖర్‌లను విచక్షణారహితంగా కొట్టి, థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. వార్తలు రాసినందుకు జర్నలిస్టులను వేధించడం భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు మాదిగ జర్నలిస్టు ఫోరం అండగా నిలుస్తుందని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే ఫోరం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.


@@లోకల్ యాడ్స్@@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బోరగాల మొగిలి గారు, 29వ వార్డు కౌన్సిలర్ హుజురాబాద్ పురపాలక సంఘం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!