26వ వార్డులో చిన్న బతుకమ్మ వేడుకల కోలాహలం! – నిత్యం మహిళలకు ప్రసాదం..డ్రా లో చీర బహుమతీ

—ఓల్డ్ వెంకటేశ్వర టాకీస్ లో అట్టహాసంగా జరుగుతున్న బతుకమ్మ వేడుకలు
—కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య – నర్సింహారెడ్డిల ప్రత్యేక పర్యవేక్షణ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 26 వ వార్డులో ఎనిమిది రోజుల పాటు జరుగు చిన్న బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య – నర్సింహారెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ వేడుకల ను వార్డులో గల విశాల ప్రదేశం ఓల్డ్ వెంకటేశ్వర టాకీస్ లో (పత్తి వాసుదేవరెడ్డి కాంప్లెక్స్) ప్రతి నిత్యం బతుకమ్మ వేడుకల కోలాహలం నెలకొంది, ఎంగిలి పూల రోజున మున్సిపల్ ఆద్వర్యం లో ఏర్పాటు చేసినప్పటికీ, మిగతా 7 రోజుల పాటు కౌన్సిలర్ లావణ్య, వార్డు ప్రజల సహకారంతో ఏర్పాట్లు చేసి నిత్యం సాయంత్రం వేళ బతుకమ్మ ఆట పాటలతో ఆ ప్రాంతం మారుమోగుతోంది.


ప్రతి రోజు దాతల సహకారంతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్న మహిళల కోసం నిత్య ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ప్రతి రోజూ ఒక్కో తీరు ప్రసాదం వంటకాలు పోకల రంగయ్య ఆద్వర్యంలో అక్కడే వంటకాలు చేస్తున్నారు. అంతే కాకుండా ప్రతి రోజు ఒక్క చీరను లక్కీ డ్రా నిర్వహిస్తూ డ్రా లో వెళ్ళిన మహిళలకు చీర బహుమతిగా అందచేస్తున్నారు. సౌండ్స్ పాటలు, లైటింగ్, మంచినీటి సౌకర్యం అందించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య – నర్సింహారెడ్డి లు ఏర్పాట్లు వార్డు ప్రజలు ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లుగా వార్డులో మహిళల కోరిక మేరకుఈ ఏర్పాట్లు చేసి మహిళలు, పిల్లల్లో బతుకమ్మ పండుగ ప్రత్యేకతను గొప్పగా జరుపుకునేందుకు ముందుకు సాగుతున్నట్లు లావణ్య తెలిపారు.


గత మూడేళ్లు గా దాతల సహకారంతో పాటు తమ సొంత ఖర్చుల తో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కౌన్సిలర్ లావణ్య పేర్కొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బోరగాల మొగిలి గారు, 29వ వార్డు కౌన్సిలర్, హుజురాబాద్ పురపాలక సంఘం.

