Social 1080×1350 • Multi-page
15-10-2026 BREAKING NEWS 06:28 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యానగర్‌లో ఘనంగా చండీ హోమం.. – మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ వి. నవీన్ చంద్ ఐపీఎస్ ప్రత్యేక పూజలు

విద్యానగర్‌లో ఘనంగా చండీ హోమం.. – మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ వి. నవీన్ చంద్ ఐపీఎస్ ప్రత్యేక పూజలు
IMG_20261015_182606

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : పట్టణంలోని విద్యానగర్‌లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చండీ హోమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ వి నవీన్ చంద్ ఐపీఎస్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హుజురాబాద్ పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని, పండుగలను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వైష్ణవి మురళి మంచికట్ల, దామెర అనుషా – అనురాగ్, గురుస్వామి నటరాజ్ బుర్ర, ఎల్.వి. అర్జున్‌తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


@@లోకల్ యాడ్స్@@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బోరగాల మొగిలి గారు, 29వ వార్డు కౌన్సిలర్, హుజురాబాద్ పురపాలక సంఘం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!