Social 1080×1350 • Multi-page
15-10-2026 BREAKING NEWS 11:37 PM
swarnodayam.com
Telugu Daily News

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వాణిజ్య సెల్ అధ్యక్షుడిగా తాటిపల్లి రాజన్న నియామకం

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వాణిజ్య సెల్ అధ్యక్షుడిగా తాటిపల్లి రాజన్న నియామకం
IMG_20261015_233640

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజూరాబాద్, అక్టోబర్ 15: కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వాణిజ్య సెల్ అధ్యక్షుడిగా తాటిపల్లి రాజన్న నియమితులయ్యారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

​గురువారం హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్.. తాటిపల్లి రాజన్నకు నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.

​పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం : వొడితల ప్రణవ్

​ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి సముచిత స్థానం దక్కుతుందని స్పష్టం చేశారు. జిల్లాలోని వ్యాపార, వాణిజ్య వర్గాలను సమన్వయం చేసుకుంటూ, వారి సమస్యల పరిష్కారానికి రాజన్న కృషి చేయాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా వ్యాపారులకు, వాణిజ్య వర్గాలకు అండగా ఉంటుందని, ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

​పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: తాటిపల్లి రాజన్న

​తనపై నమ్మకంతో ఈ బృహత్తర బాధ్యతను అప్పగించిన రాష్ట్ర మంత్రులకు, జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి, ముఖ్యంగా నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్‌కు తాటిపల్లి రాజన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అధిష్టానం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వాణిజ్య రంగానికి చెందిన వర్గాల సంక్షేమానికి, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, వాణిజ్య, వ్యాపార వర్గాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


@@లోకల్ యాడ్స్@@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బోరగాల మొగిలి గారు, 29వ వార్డు కౌన్సిలర్, హుజురాబాద్ పురపాలక సంఘం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!