Social 1080×1350 • Multi-page
15-10-2026 BREAKING NEWS 11:55 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో వైభవంగా బతుకమ్మ వేడుకలు

హుజురాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో వైభవంగా బతుకమ్మ వేడుకలు
IMG-20261015-WA0157

​-తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనం బతుకమ్మ : వొడితల ప్రణవ్

—మహిళా నాయకురాళ్లతో కలిసి వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజురాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనమని, పూలనే ప్రకృతిగా భావించి పూజించే గొప్ప పండుగ అని హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా శ్రేణులకు ముందస్తుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ వేడుకల కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేడుకల్లో పాల్గొన్న వొడితల ప్రణవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా అభ్యున్నతికే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. “ఇంటికి దీపం మహిళలే” అన్న భావనతో ప్రభుత్వం పనిచేస్తోందని, రానున్న రోజుల్లో మహిళల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

​ఈ సందర్భంగా నియోజకవర్గవ్యాప్తంగా తరలివచ్చిన మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలతో కలిసి వొడితల ప్రణవ్ బతుకమ్మ ఆడి పాడారు. మహిళా శ్రేణుల రాకతో పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది.

​ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, పలువురు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, వివిధ మండలాల, పట్టణ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, ప్రజాప్రతినిధులు మరియు అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బోరగాల మొగిలి గారు, 29వ వార్డు కౌన్సిలర్, హుజురాబాద్ పురపాలక సంఘం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!