Social 1080×1350 • Multi-page
16-10-2026 BREAKING NEWS 12:04 AM
swarnodayam.com
Telugu Daily News

బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

బతుకమ్మ, దసరా ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG_20261016_000724

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే సద్దుల బతుకమ్మ, ప్రజలు జరుపుకునే దసరా పండుగ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకునేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. గురువారం ఆయన కెసి క్యాంపు లోని తన క్యాంపు కార్యాలయంలో హుజురాబాద్ జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో ప్రజాప్రతినిధులతో సమక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ముఖ్యంగా బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు.ఇటీవల హుజురాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఎదురైన ఇబ్బందులు బతుకమ్మ పండుగ రోజున పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాల్లోనూ బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆర్డీవో జల కుమార్ కి ఫోన్ ద్వారా తెలియజేశారు. అన్ని మండలాల్లో అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు.బతుకమ్మ వేడుకలు జరిగే ప్రాంతాల్లో మహిళలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో మహిళలు సౌకర్యవంతంగా వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని, నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. పండుగ సమయంలో ఎలాంటి సమస్య తలెత్తినా అధికారులు వెంటనే స్పందించేలా అందుబాటులో ఉండాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఎమ్మెల్యే సూచించారు.


@@లోకల్ యాడ్స్@@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బోరగాల మొగిలి గారు, 29వ వార్డు కౌన్సిలర్, హుజురాబాద్ పురపాలక సంఘం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!