ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. – ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షులు పొలాడి రామ రావు

––అన్ని వర్గాల పేదలకు సమ న్యాయం కావాలి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (చొప్పదండి), అక్టోబర్ 16 : ఆర్థికంగా వెనుకబడిన పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, రాష్ట్ర కో ఆర్డినేటర్ సంధి తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు.

శుక్రవారం చొప్పదండిలో ఓసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఏనుగు చొక్కారెడ్డి అధ్యక్షతన ఉమ్మడి జిల్లాల ఓసీ ఐకాస, రెడ్డి జేఏసీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అన్ని సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతుల అధ్యయనానికి చట్టబద్ధమైన ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు.

తాము ఏ కులానికీ, మతానికీ వ్యతిరేకం కాదని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల్లోని పేదలకు సమాన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుత రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించి, క్రీమీలేయర్ నిబంధనలు, అర్హత ప్రమాణాలపై సమగ్ర సమీక్ష జరపాలని సూచించారు.

సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ అరోరా ఢిల్లీ రాజ్ ఘాట్ నుంచి చేపట్టిన దేశవ్యాప్త బస్సు రథయాత్రకు ఓసీ, రెడ్డి జేఏసీలు, బహుజన కుల సంఘాల JAC సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర ఈ నెల 24న ఆదిలాబాద్ లో ప్రవేశించి, నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి మీదుగా 25న రామాయంపేట, తూప్రాన్, హైదరాబాద్, 26న జనగామ, హనుమకొండ మీదుగా పరకాలకు చేరుకుంటుందని, అక్కడ 50 వేల మందితో భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు.
ఈ సందర్భంగా బస్సు రథయాత్ర గోడ ప్రతులను పోలాడి రామారావు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు కొమర ఎల్లారెడ్డి, రూప్ రెడ్డి, స్కైలాబ్ రెడ్డి, కేతిరి మణిశంకర్ రెడ్డి, గన్ను నర్సింహారెడ్డి, గుర్రం అంజిరెడ్డి, జంపాల నర్సయ్య, బచ్చు ఆనందం, తాళ్లపల్లి కొంరయ్య తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ వజ్జేపల్లి వెంకటేశ్వరరావు గారు, 14వ వార్డు కౌన్సిలర్ (బోర్నపల్లి), హుజురాబాద్ పురపాలక సంఘం.

