నిబంధనలు పాటించని మెడికల్, ల్యాబ్ లపై చట్టరీత్యా చర్యలు. – బల్దియా కమిషనర్ కిషన్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని మెడికల్ షాపులు, ఆస్పత్రులు, డయాగ్నిక్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, పాటించని వాటిపై మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ బండి కిషన్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన మెడికల్ షాపులు ఆసుపత్రులు ల్యాబ్ల యజమానులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆసుపత్రులు, మెడికల్ షాపులు మెడికల్ ల్యాబుల నుండి వెలువడే హానికరమైన బయో మెడికల్ వేస్టును ఆరు బయట, మునిసిపల్ ట్రాక్టర్ నందు వేయరాదని అన్నారు. ప్రజలకు పర్యావరణమునకు ఎలాంటి హాని కలగకుండా బయో మెడికల్ వేస్టును ప్రత్యేకముగా సేకరించే వారికి అందించి, పట్టణ సుందరీకరణకు సహకరించాలన్నారు. ప్రతి ఆర్ధిక సంవత్సరము విధిగా పురపాలక సంఘము నుండి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని అన్నారు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి బయో మెడికల్ వేస్టును ఆరుబయట వేసిన వారిపై పురపాలక పరిపాలనా చట్టము 2019 క్రమము తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ డి. కిరణ్, కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కర్ర పాపిరెడ్డి, కార్యదర్శి సంగెం శ్రీనివాస్ , కోశాధికారి చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, దాసి కుమారస్వామి, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ వజ్జేపల్లి వెంకటేశ్వరరావు గారు, 14వ వార్డు కౌన్సిలర్ (బోర్నపల్లి), హుజురాబాద్ పురపాలక సంఘం.

