కరెంటు కోతలు, సాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. -బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సంఘ నరేష్

—రైతులకు నిరంతర విద్యుత్, సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం – బీజేపీ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీజేపీ హుజురాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై రైతు సన్నాహక సమావేశాన్ని పెద్దపాపయ్యపల్లి రోడ్డులోని విశేష ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సంఘ నరేష్ హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు పంటలు సాగు చేసుకునే కీలక సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా లేకపోవడం, సాగునీరు అందకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
రైతులు దేశానికి వెన్నెముక అని చెప్పడమే కాకుండా, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని అన్నారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ను నిరంతరాయంగా అందించాలని, సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగించి రైతులకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం చూపాలి. రైతులని విస్మరించిన గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే గతి పడుతుందని హెచ్చరించారు.
రైతుల ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
ఈనెల 23వ తేదీన నిర్వహించే కరీంనగర్ కలెక్టరేట్ వద్ద రైతు నిరసన కార్యక్రమంలో రైతులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, మాజీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, ప్రధాన కార్యదర్శి తిప్పభత్తిని రాజు, గంట సంపత్, సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, కొలిపాక శ్రీనివాస్, ఎండి అజార్, పడారి కొమురయ్య, డోరి ఐలయ్య, కిషన్ మోర్చా అధ్యక్షులు మాసాడి శ్రీనివాసరావు, బీజేవైఎం అధ్యక్షులు మోటపోతుల రాకేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఎర్ర శ్రీధర్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొలిపాక వెంకటేష్, కార్యదర్శి కొడిమ్యాల పవన్ కుమార్, బూత్ అధ్యక్షులు క్యాష వెంకటేష్, యాట రాజేష్ ఖన్నా, ఆవుల సదయ్య, కుర్ర సంపత్, కుసుమ సమ్మయ్య, దాసరి వీరన్న, మాసాడి రవీందర్రావు, గూడూరి మల్లారెడ్డి, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ మరియు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ వర్దినేని రవీందర్ రావు గారు, 12వ వార్డు కౌన్సిలర్, హుజురాబాద్ పురపాలక సంఘం. మరియు సామాజిక కార్యకర్త..

