Social 1080×1350 • Multi-page
17-10-2026 BREAKING NEWS 11:19 PM
swarnodayam.com
Telugu Daily News

మా బకాయిలు చెల్లించేది ఎప్పుడు?

మా బకాయిలు చెల్లించేది ఎప్పుడు?
Oplus_16908288

–ప్రైవేట్ విత్తన కంపెనీ నిర్వాహకంపై రైతుల నిరసన

​-ఏడాది గడుస్తున్నా సరికాని చెల్లింపులు | సాకులు చెబుతున్నారంటూ ఆగ్రహం

​మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : తమ వద్ద కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్‌లోని మధ్యప్రదేశ్‌కు చెందిన ‘ఈగల్ సీడ్స్’ కంపెనీ కార్యాలయం వద్ద రైతులు శనివారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బాకీ పడ్డ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారంటూ కంపెనీ ఉద్యోగులను రైతులు నిలదీశారు.

​అసలేం జరిగింది?

హుజురాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలువురు రైతులతో దాదాపు 300 ఎకరాల్లో ఈగల్ సీడ్స్ కంపెనీ వరి, మొక్కజొన్న పంటలను సాగు చేయించింది. పంట పూర్తయిన తర్వాత రైతుల వద్ద నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు చెల్లింపులు చేయలేదు. బాకీ డబ్బుల కోసం కంపెనీ ఉద్యోగుల చుట్టూ తిరుగుతున్నా వారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపించారు.

​-సాకులు చెబుతున్నారంటూ ఆగ్రహం:

డబ్బులు అడిగినప్పుడల్లా విత్తనాల ప్రాసెసింగ్, జర్మినేషన్ (మొలక శాతం) లోపాలు ఉన్నాయంటూ కంపెనీ ప్రతినిధులు లేనిపోని సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. శనివారం బాధితులైన రైతులందరూ ఒక్కసారిగా కంపెనీ కార్యాలయానికి చేరుకుని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

-​త్వరలోనే చెల్లిస్తామని హామీ:

రైతుల నిరసనతో దిగివచ్చిన కంపెనీ స్థానిక ఉద్యోగులు వెంటనే ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా రైతులకు మాట్లాడించారు. బాకీ పడ్డ సొమ్మును త్వరలోనే రైతులకు చెల్లిస్తామని కంపెనీ అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు తమ నిరసనను విరమించి శాంతించారు. హామీ ప్రకారం బకాయిలు చెల్లించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించారు.


@@లోకల్ యాడ్స్@@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ మరియు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ వర్దినేని రవీందర్ రావు గారు, 12వ వార్డు కౌన్సిలర్, హుజురాబాద్ పురపాలక సంఘం. మరియు సామాజిక కార్యకర్త.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!