అనుమతుల్లేని పేలుడు పదార్థాలు స్వాధీనం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్) : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం గ్రామంలో పోలీసులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రామడుగు మండలం శ్రీరాములపల్లికి చెందిన వేముల భూమయ్య (50)ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 475 జిలెటిన్ స్టిక్కులు, సుమారు 3,000 మీటర్ల ఫ్యూజ్ వైర్లు, రెండు కంప్రెసర్ వాహనాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సరైన లైసెన్సు, సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా వ్యవసాయ బావి తవ్వకాల కోసం వీటిని వినియోగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని సైదాపూర్ ఎస్సై కొప్పుల స్వాతి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ మరియు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ వర్దినేని రవీందర్ రావు గారు, 12వ వార్డు కౌన్సిలర్, హుజురాబాద్ పురపాలక సంఘం. మరియు సామాజిక కార్యకర్త.

