Social 1080×1350 • Multi-page
24-05-2024 BREAKING NEWS 09:12 AM
swarnodayam.com
Telugu Daily News

ఉద్యమకారుడి కుటుంబానికి పలువురి పరామర్శ

ఉద్యమకారుడి కుటుంబానికి పలువురి పరామర్శ
IMG-20240524-WA0148

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

హుజురాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు ఇమ్మడి బాబు మాతృమూర్తి ఇమ్మడి వీరమ్మ ఇటీవల పరమపదించిన సందర్బంగా శుక్రవారం నాడు కందుగులలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వర్ధిని రవీందర్ రావు, జేఏసీ నేతలు ఆవునూరి సమ్మయ్య, పల్కల ఈశ్వర్ రెడ్డి, చందా గాంధీ, భీమోజు సదానందం, రొంటాల బుచ్చయ్యలు ఇమ్మడి బాబును,ఆయన కుటుంబ సభ్యులను కలసి పరామర్శించారు. అంతకు ముందు కీర్తిశేషులు ఇమ్మడి వీరమ్మ చిత్ర పటం వద్ద వీరు నివాళులర్పించారు. పేరుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, దళిత, ప్రజా సఘాల నాయకులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!