Social 1080×1350 • Multi-page
18-10-2026 BREAKING NEWS 01:21 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్‌లో బతుకమ్మ సౌల్ల ఏర్పాట్ల పరిశీలన.. -మున్సిపల్ సిబ్బందికి మార్నింగ్ వాకర్స్ ఫ్రెండ్స్ సూచనలు

హుజురాబాద్‌లో బతుకమ్మ సౌల్ల ఏర్పాట్ల పరిశీలన.. -మున్సిపల్ సిబ్బందికి మార్నింగ్ వాకర్స్ ఫ్రెండ్స్ సూచనలు
IMG-20261018-WA0102

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, అక్టోబర్ 18: సద్దుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని స్థానిక బతుకమ్మ సౌల్లలో ఏర్పాట్లను ‘మార్నింగ్ వాకర్స్ ఫ్రెండ్స్’ బృందం ఆదివారం పరిశీలించింది.

​సౌల్లలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా బతుకమ్మలు ఆడుకునేలా మరియు సులభంగా నిమజ్జనం చేసుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బందికి వారు స్పష్టం చేశారు. జెసిబి సహాయంతో మట్టిని తొలగించి తొట్టిలా తయారుచేసి పంపింగ్ ద్వారా నీటిని నింపించారు.

​ముఖ్యమైన సూచనలు:

  • ​నీటి సౌకర్యం: మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బతుకమ్మలు నిమజ్జనం చేయడానికి తగినంత నీటిని పంపింగ్ చేయాలని కోరారు.
  • ​భద్రతా చర్యలు: నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
  • ​బాధ్యతాయుతమైన విధులు: మున్సిపల్ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించి వేడుకలు విజయవంతం కావడానికి సహకరించాలని కోరారు.

​ఏర్పాట్లను పరిశీలించిన వారిలో.. :

​ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మార్నింగ్ వాకర్స్ ఫ్రెండ్స్ నాయకులు వర్ధినేని రవీందర్ రావు, కే. మల్లారెడ్డి, కొలిపాక శంకర్, సాయి, బెదరకోట రవీందర్, విడపు రాజు, కేసిరెడ్డి నరసింహారెడ్డి, పాక సతీష్, సంపంగి (మైకేల్) రాజేందర్, కొండ గణేష్, బత్తుల సమ్మయ్య, తాటిపాముల దేవేందర్, భాస్కరాచారి, మక్కపల్లి రమేష్ యాదవ్, మండల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


@@లోకల్ యాడ్స్@@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ మరియు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ కంకణాల రమేష్ రెడ్డి గారు, విశ్వహిందూ పరిషత్ హుజురాబాద్ (ఎదులాపురం) మండల అధ్యక్షుడు.


స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ మరియు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ గొట్టే జమదగ్ని గారు (రిటైర్డ్ ఎంఈఓ) కో ఆప్షన్స్ సభ్యుడు పురపాలక సంఘం హుజూరాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!