Social 1080×1350 • Multi-page
18-10-2026 BREAKING NEWS 11:23 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్‌లో వైభవంగా సద్దుల బతుకమ్మ : పాల్గొన్న కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్

హుజురాబాద్‌లో వైభవంగా సద్దుల బతుకమ్మ : పాల్గొన్న కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్
IMG-20261018-WA0252

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, అక్టోబర్ 18: హుజురాబాద్ పట్టణంలోని బతుకమ్మ ఘాట్ (సౌళ్లు)లో సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగాయి. ఈ సంబరాలలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

​కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గందె సుహాసిని, వైస్ చైర్‌పర్సన్ గూడూరు అంజలి, స్థానిక కౌన్సిలర్లు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహిళలతో కలిసి ఆయన వేడుకల్లో పాలుపంచుకున్నారు.

​బతుకునిచ్చే తల్లి గౌరమ్మ అందరినీ చల్లగా చూడాలి: వొడితల ప్రణవ్

​ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ… “బతుకునిచ్చే బతుకమ్మ పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండేలా గౌరమ్మ తల్లి ఆశీస్సులు అందించాలని వేడుకున్నాను” అని తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన విజయదశమి (దసరా) పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

మున్సిపల్ పాలకవర్గం, అధికారులకు సన్మానం

​పట్టణంలో బతుకమ్మ వేడుకల కోసం మున్సిపల్ పాలకవర్గం, అధికారులు అద్భుతమైన ఏర్పాట్లు చేశారని ప్రణవ్ అభినందించారు. కార్యక్రమాలు ప్రశాంతంగా, ఘనంగా జరగడానికి సహకరించిన అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఇతర భాగస్వాములను ఆయన శాలువాలతో ఘనంగా సన్మానించారు.

పాల్గొన్న ముఖ్యులు:

ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, వైస్ చైర్‌పర్సన్ అంజలి, వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ కిషన్, టౌన్ సీఐ కరుణాకర్, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బందితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


@@లోకల్ యాడ్స్@@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ మరియు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు : శ్రీ కంకణాల రమేష్ రెడ్డి గారు, విశ్వహిందూ పరిషత్ హుజురాబాద్ (ఎదులాపురం) మండల అధ్యక్షుడు.


స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ మరియు సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ గొట్టే జమదగ్ని గారు (రిటైర్డ్ ఎంఈఓ) కో ఆప్షన్స్ సభ్యుడు పురపాలక సంఘం హుజూరాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!