హుజురాబాద్‌లో ఘనంగా “మార్నింగ్ ఫ్రెండ్స్” అలయ్ బలాయీ వేడుకలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, అక్టోబర్ 20 :
పండుగల వేళ ప్రజలందరిలో పరస్పర సోదరభావం, ఆప్యాయతలను పెంపొందించే ఉద్దేశంతో హుజురాబాద్‌లో “మార్నింగ్ ఫ్రెండ్స్” ఆధ్వర్యంలో అలయ్ బలాయీ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.



మార్నింగ్ ఫ్రెండ్స్ కన్వీనర్ వర్ధినేని రవీందర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మార్నింగ్ వాకర్స్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పర్వదినాలలో మార్నింగ్ వాకర్స్ కుటుంబాలు సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో హుజురాబాద్‌లో తొలిసారిగా ఈ దసరా అలయ్ బలాయీ వేడుకలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దుర్గాదేవి మందిరాలను సందర్శించి మాత ఆశీస్సులు పొందారు. గ్రూప్ సభ్యులతో పాటు ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు రవీందర్ రావు మరియు మామిడిపెళ్లి సాయి వెల్లడించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన భార్య శాలిని రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదర్శవంతమైన జీవనం: పండుగ సమయాలలో సభ్యులందరూ క్రమశిక్షణ, నీతి నిజాయితీలతో నడుచుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా రవీందర్ రావు పిలుపునిచ్చారు.



ఈ ఆనందకరమైన వేడుకల్లో పది తరాలకు చెందిన సభ్యులు పెద్దఎత్తున తరలివచ్చి ఒకరికొకరు ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బండ శ్రీనివాస్, కటుకూరి మల్లారెడ్డి, పలకల ఈశ్వర్ రెడ్డి, ముక్కెర రాజు, చింత శ్రీను, సంఘం ఐలయ్య, విడపు రాజు, కేశిరెడ్డి నరసింహారెడ్డి, జున్నోజు భాస్కర్, కొలిపాక శంకర్, కొలిపాక సమ్మయ్య, మహేష్, గనిశెట్టి ఉమామహేశ్వర్, బెదరకోట రవీందర్, తాళ్లపల్లి సతీష్, బత్తుల సమ్మయ్య, సొల్లు బాబు, కొండ్రా నరేష్, పంజాల రామ్ శంకర్ గౌడ్, మండ సతీష్, కానుగంటి శ్రీనివాస్, జెకె ప్రభాకర్, గూడూరు స్వామిరెడ్డి, రావుల రాజలింగారెడ్డి, ఒంటెల రాజిరెడ్డి, సంపంగి రాజేందర్ మైకేల్, కొత్తూరి రమేష్, కేతిరి శ్రీనివాస్ రెడ్డి, కామణి రవీందర్, పరాంకుశం కిరణ్ కుమార్, మండల యాదగిరి, గడ్డం ధర్మారెడ్డి, బత్తుల రాజలింగం, తాటిపాముల దేవేందర్, మక్కపల్లి రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ మరియు మిత్రులు శ్రేయోభిలాషులకు విజయదశమి(దసరా) శుభాకాంక్షలు.




