Social 1080×1350 • Multi-page
21-10-2026 BREAKING NEWS 09:22 PM
swarnodayam.com
Telugu Daily News

రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులకు తీవ్ర గాయాలు. – వల్బాపూర్ సమీపంలో ఘటన.

రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులకు తీవ్ర గాయాలు. – వల్బాపూర్  సమీపంలో ఘటన.
IMG-20261021-WA0027

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ అక్టోబర్ 21: ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ ప్రాంతంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో హుజురాబాద్ పట్టణానికి చెందిన తండ్రి, కుమారులు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్కతుర్తి నుంచి హుజురాబాద్ కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న గారంపల్లి సుమన్ (41), ఆయన కుమారుడు నాగ చరణ్ (17) రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గారంపల్లి సుమన్ హుజూరాబాద్ పట్టణంలో వాసుదేవ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్లో శ్రీ శ్రీరామ ఐరన్ షాపును నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ మరియు మిత్రులు శ్రేయోభిలాషులకు విజయదశమి (దసరా) శుభాకాంక్షలు.

తెలియజేస్తున్న వారు:



Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!