Social 1080×1350 • Multi-page
22-10-2026 BREAKING NEWS 07:48 PM
swarnodayam.com
Telugu Daily News

వాస్తవ పరిస్థితుల పట్ల రైతులకు అవగాహన కలిగించాలి. -డిఏఓ చత్రు నాయక్

వాస్తవ పరిస్థితుల పట్ల రైతులకు అవగాహన కలిగించాలి. -డిఏఓ చత్రు నాయక్
IMG-20261022-WA0036

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : తీవ్ర వర్షాభావ పరిస్థితుల ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు అన్ని విషయాల పట్ల వ్యవసాయ అధికారులు అవగాహన కలిగించాలని
జిల్లా వ్యవసాయ అధికారి చత్రూ నాయక్ అన్నారు. గురువారం హుజూరాబాద్ ఎడిఏ కార్యాలయంలో ఆయన వ్యవసాయ అధికారుల, వ్యవసాయ విస్తరణ అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఫార్మర్ రిజిస్ట్రీ, డిజిటల్ పంట సర్వే, ఎల్నినో పరిస్థితులలో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో సమావేశాలు పూర్తి స్థాయిలో నిర్వహించాలన్నారు. రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల పైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితులకు అణుగుణంగా రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో హుజురాబాద్ ఏడిఏ జి సునీత, ఏవో భూమిరెడ్డి, వివిధ మండలాల ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!