Social 1080×1350 • Multi-page
22-10-2026 BREAKING NEWS 08:04 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న 174వ జయంతి ఉత్సవాలు

ఘనంగా తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న 174వ జయంతి ఉత్సవాలు
IMG-20261022-WA0037

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజురాబాద్, అక్టోబర్ 22: తెలంగాణ రాబిన్ హుడ్, బహుజన విప్లవకారుడు పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి వేడుకలను హుజురాబాద్ అంబేద్కర్ కూడలిలో ముదిరాజ్ సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

​ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

​చరిత్రలో పండుగ సాయన్న పాత్ర:

​ఈ సందర్భంగా కొలిపాక సమ్మయ్య మాట్లాడుతూ… 1840 నుంచి 1900 కాలంలో నిజాం పాలనలో రజాకార్ల ఆగడాలను ఎదిరించి, అక్రమ సంపన్నుల గడీలను కొల్లగొట్టి పేదల ఆకలి తీర్చిన మహాయోధుడు తెలంగాణ బందూకు పండుగ సాయన్న అని కొనియాడారు. అలాంటి గొప్ప వీరుడు ముదిరాజ్ జాతిలో జన్మించడం యావత్ ముదిరాజులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.

​ముదిరాజుల ప్రధాన డిమాండ్లు:

  • ​బీసీ-డీ నుండి బీసీ-ఏ కి మార్పు: పండుగ సాయన్న స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, ముదిరాజులను ‘బీసీ-డీ’ నుండి ‘బీసీ-ఏ’ కేటగిరీలోకి మార్చాలని డిమాండ్ చేశారు.
  • ​ప్రభుత్వంపై ఒత్తిడి: ఈ డిమాండ్ సాధన కోసం తెలంగాణలోని ముదిరాజులందరూ ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు.

​ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు గుడ్డేల్గుల సమ్మయ్య, పోచయ్య, పిల్లి సమ్మయ్య, గోస్కుల వెంకన్న, గుడ్డేల్గుల సారయ్య, రవీందర్ బాబుతో పాటు బహుజన నాయకులు వేల్పుల రత్నం, కొలిపాక శ్రీనివాస్, ఉప్పు శ్రీనివాస్ పటేల్, రాం రాజేశ్వర్, తులసి లక్ష్మణమూర్తి, బుర్రి శేఖర్, వేల్పుల ప్రభాకర్, చిలుకమరి శ్రీనివాస్, రఘుచారి ఆయా వివిధ బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!