Social 1080×1350 • Multi-page
23-10-2026 BREAKING NEWS 01:52 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్‌లో విషాదం.. – ఆపద్భాంధవుడిలా నిలిచిన 25వ వార్డు కౌన్సిలర్

హుజురాబాద్‌లో విషాదం.. – ఆపద్భాంధవుడిలా నిలిచిన 25వ వార్డు కౌన్సిలర్
IMG-20261023-WA0071

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజురాబాద్ : పట్టణంలోని 25వ వార్డులో విషాద ఛాయలు అలుముకున్నాయి. అదే వార్డుకు చెందిన కమ్మరి కులస్తుడు పవార్ గోపి (వృత్తిరీత్యా కమ్మరి) అనారోగ్యంతో గురువారం సాయంత్రం మృతి చెందారు. వృత్తిరీత్యా ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషించే గోపి అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.
​ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు 25వ వార్డు కౌన్సిలర్ కొండ ప్రశాంతి మురళి ముందుకొచ్చారు. పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి దహన సంస్కారాల నిమిత్తం తక్షణ సహాయంగా రూ. 10,000/- (పది వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
​కష్టకాలంలో మానవత్వాన్ని చాటుకుంటూ, బాధిత కుటుంబాన్ని ఆదుకున్న కౌన్సిలర్ కొండ ప్రశాంతి మురళి ఉధరతను స్థానికులు, పలువురు ప్రముఖులు అభినందించారు.

​ఈ సందర్భంగా పవార్ గోపి మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ.. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము అన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!