ప్రైవేటు స్కూల్ బస్సులకు గుదిబండగా టోల్ గేట్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి 563 పై కొత్త గట్టు వద్ద ఏర్పాటుచేసిన టోల్ గేట్ ప్రైవేట్ స్కూల్ బస్సు లకు గుదిబండ గా మారింది. హుజురాబాద్ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల బస్సులు శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గొల్లపల్లి గ్రామాల విద్యార్థుల కోసం ప్రతిరోజు వస్తాయి. దసరా సెలవులు అనంతరం శుక్రవారం ప్రవేట్ పాఠశాలల బస్సులు టోల్గేట్ వరకు రావడంతో టోల్గేట్ వసూలు చేసే చార్జీలను చూసి పాఠశాల ల యజమానులు అవాక్కయ్యారు. ఒకరోజు పాఠశాల బస్సు కొత్తగట్టు కు వెళ్లి రావాలంటే వెయ్యి రూపాయలు టోల్ టాక్స్ పడుతుంది. నెలకు 17వేల రూపాయలు టికెట్ తీసుకుంటే అవుతుంది. దీంతో ప్రైవేట్ పాఠశాలల యజమానులకు ఇది గుదిబండల మారిపోయింది. ఒక్క టోల్ గేట్ కి ఇన్ని డబ్బులు ఖర్చు అవుతే పాఠశాలకు అదనకు భారంగా మారనుంది. ఇది పిల్లలపై పడే అవకాశం ఉంటుంది. బడ్జెట్ పాఠశాలలో ఒక్క గ్రామం కోసం ప్రతి నెల 17వేల రూపాయలు భరించాల్సి వస్తుంది. దీంతో పాఠశాలల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ గ్రామానికి బస్సు పంపించకుంటే విద్యార్థులు నష్టపోతారు పంపితే పాఠశాల కు అదనపు ఖర్చు అవుతుంది దీనిని ఎవరు భరించాలి అన్న సమస్య వెంటాడుతుంది.

–ఎన్ హెచ్ అధికారులకు ట్రస్మా వినతి**
కేవలం ఒక్క కొత్త గట్టు గ్రామానికి వెళ్లడానికి నెలకు 17వేల రూపాయలు అదనపు భారం పాఠశాలల యజమానులపై పడుతుండడంతో శుక్రవారం హుజురాబాద్ ట్రస్మ నాయకులు హన్మకొండలోని జాతీయ రహదారి కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. టోల్ గేటు టాక్స్ నుండి ప్రైవేట్ పాఠశాలలకు మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో. ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోరం సంజీవరెడ్డి, హుజురాబాద్ అధ్యక్షులు వకుళాభరణం వెంకటేశ్వర్లు, నాయకులు పారెడ్డి రవీందర్ రెడ్డి మాడిశెట్టి ప్రసాద్, దాసరి కోటేశ్వర్ యాదవ్, వేణుమాధవ్, గౌతంరెడ్డి, షాజు థామస్ తదితరులు పాల్గొన్నారు.

