బూత్ కమిటీల బలోపేతమే బీజేపీకి వెన్నెముక : – బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు – హుజురాబాద్‌లో ఘనంగా బీజేపీ శక్తి కేంద్ర ఇన్‌చార్జిల సమావేశం.. -రేపు ప్రతి శక్తి కేంద్రంలో ‘టిఫిన్ బైఠక్’ కార్యక్రమాలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : భారతీయ జనతా పార్టీ సంస్థాగత బలోపేతంలో బూత్ కమిటీలే వెన్నెముక అని, ప్రతి బూత్‌లో పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు పిలుపు నిచ్చారు.
శనివారం హుజురాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇన్‌చార్జిల ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, బూత్ కమిటీల పటిష్టత, యువకుల సమ్మేళనం, ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమాల నిర్వహణపై విస్తృతంగా చర్చించారు.
సమావేశంలోని ముఖ్య అంశాలు:
బూత్ స్థాయిలో పార్టీ పటిష్టత:
ప్రతి బూత్‌లో క్రియాశీల కార్యకర్తలను గుర్తించి కమిటీలను నిర్మించాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
యువకుల సమ్మేళనాలు:
పార్టీ కార్యక్రమాల్లో యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేస్తూ, వారిలో దేశభక్తి, సేవాభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా యువకుల సమ్మేళనాలను విజయవంతం చేయాలని నిర్ణయించారు.
ప్రతి బూత్‌లో ‘మన్ కీ బాత్’:
ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ప్రతి బూత్‌లో స్థానిక ప్రజలు, కార్యకర్తల భాగస్వామ్యంతో వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రేపు ‘టిఫిన్ బైఠక్’ కార్యక్రమాలు:
జిల్లా పార్టీ పిలుపు మేరకు రేపు (ఆదివారం) హుజురాబాద్ పరిధిలోని ప్రతి శక్తి కేంద్రంలో ‘టిఫిన్ బైఠక్’ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యకర్తల మధ్య సమన్వయం, బూత్ స్థాయి సమస్యలు మరియు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఈ బైఠక్‌లలో చర్చించనున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో శక్తి కేంద్ర ఇన్‌చార్జిలతో పాటు జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్ మెంబర్ సబ్బని రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శులు గంట సంపత్, తిప్పబత్తిని రాజు, ఉపాధ్యక్షులు యాల్ల సంజీవరెడ్డి, వోడ్నాల విజయ్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొలిపాక వెంకటేష్, సీనియర్ నాయకులు యాంసాని శశిధర్, నరాల రాజశేఖర్, అంకతి వాసు తదితరులు పాల్గొన్నారు.

