Telugu Daily News
పేదవారికి ఉచిత న్యాయ సేవ సహకారం. – న్యాయమూర్తి పిబి కిరణ్ కుమార్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : వివిధ కారణాలవల్ల శిక్షణ అనుభవిస్తున్న నిరుపేదలకు ఉచితంగా న్యాయ సేవా సహకారాన్ని న్యాయ సేవాధికార సంస్థ అందిస్తుందని హుజురాబాద్ న్యాయమూర్తి పిబి కిరణ్ కుమార్ అన్నారు. శనివారం హుజూరాబాద్ సబ్ జైలులో ఖైదీలకు న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఉచిత న్యాయ సహాయం పొందడం రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు సేవాధికార సంస్థ చట్టం కింద అందుబాటులో ఉన్న ఉచిత న్యాయవాది సేవలు ,బెయిల్ పొందే విధానాలు లోక్ అదాలత్ ద్వారా న్యాయం పొందవచ్చు అన్నారు. ఈ సందర్భంగా ఖైదీలు అడిగిన పలు న్యాయపరమైన సందేహాలను నివృత్తి చేశారు. ఈ సదస్సులో హుజురాబాద్ సబ్ జైల్ పర్యవేక్షణ అధికారి పి శ్రీనివాస్, అసిస్టెంట్ డిప్యూటీ జైలర్ పి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

