Social 1080×1350 • Multi-page
24-10-2026 BREAKING NEWS 09:26 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్‌లో వైభవంగా అనాథ వృద్ధులు, వికలాంగుల దినోత్సవం

హుజురాబాద్‌లో వైభవంగా అనాథ వృద్ధులు, వికలాంగుల దినోత్సవం
IMG-20261024-WA0096

​మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజురాబాద్, అక్టోబర్ 24 : బాలవికాస సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హుజురాబాద్ క్లబ్‌లో అనాథ వృద్ధులు మరియు వికలాంగుల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. బాలవికాస సంస్థ పరిధిలోని 14 సెంటర్లలో మొత్తం 1,000 మంది అనాథ వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ వేడుకల సందర్భంగా 40 మంది అనాథ వృద్ధులకు నిత్యావసర వస్తువులు, దుస్తులు మరియు బియ్యం డబ్బాలను బహుమతిగా పంపిణీ చేశారు.
​ఈ సందర్భంగా 2వ వార్డు కౌన్సిలర్ సమ్రీన్ గఫర్ ఖాన్ మాట్లాడుతూ.. ఎవరూ లేని అనాథ వృద్ధుల ఆకలి తీర్చేందుకు ధర్మదాతలను ప్రోత్సహిస్తూ బాలవికాస సంస్థ వ్యవస్థాపకురాలు బాల తెరీసా జింజ్రాస్ గ చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. అనంతరం ఓసి జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు పూసల ప్రభావతిరెడ్డి, రిటైర్డ్ టీచర్ అనురాధ లు మాట్లాడుతూ.. సమాజంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, దయార్ద్ర హృదయంతో సమాజ సేవ చేస్తున్న ‘బాలమ్మ’ సేవలు గొప్పవని కొనియాడారు.
​దాతల ఉదారత – బియ్యం, దుస్తులు, భోజన వితరణ:
ఈ కార్యక్రమానికి పలువురు దాతలు తమవంతు సహాయాన్ని అందించారు. శ్రీ వాసవి అన్నపూర్ణ ట్రస్ట్ మరియు వాసవి క్లబ్ సభ్యులు గర్రెపల్లి శ్రీనివాస్, శ్రీనివాస్ విచ్చేసిన వారందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే రతన్ మీసేవ నిర్వాహకులు తమ వంతుగా వృద్ధులకు టవళ్లను పంపిణీ చేయగా, వర్ధినేని రవీందర్ రావు ప్రోగ్రాం నిర్వహణకు ఫంక్షన్ హాల్ ను ఉచితంగా అప్పగించారు. ఈ సందర్భంగా ఉదారత చాటుకున్న దాతలందరికీ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు గొట్టే జమదగ్ని, అశ్విన్, అనురాధ టీచర్, జ్యోతి, రియాజ్, అషు, వాసవి, శ్రీ వాసవి అన్నపూర్ణ ట్రస్ట్ సభ్యులు, హుజురాబాద్ కో-ఆర్డినేటర్ ఎండి ఖాజాబి, రజిత, కళ్యాణి, హైమావతి మరియు విలేజ్ లీడర్లు రమాదేవి, నజీమా తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!