Telugu Daily News
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి

స్వర్ణోదయ ప్రతినిధి న్యూఢిల్లీ:
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించనున్నారు. ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.

