Social 1080×1350 • Multi-page
25-10-2026 BREAKING NEWS 09:34 PM
swarnodayam.com
Telugu Daily News

రేపే హుజూరాబాద్‌లో భారీ సైకిల్ ర్యాలీ : పోలీస్ ఇన్‌స్పెక్టర్ టి. కరుణాకర్ పిలుపు

రేపే హుజూరాబాద్‌లో భారీ సైకిల్ ర్యాలీ : పోలీస్ ఇన్‌స్పెక్టర్ టి. కరుణాకర్ పిలుపు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజూరాబాద్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని హుజూరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6.30 గంటలకు భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టి. కరుణాకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
​ఈ సైకిల్ ర్యాలీ ద్వారా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
​కార్యక్రమ ​సమయం: సోమవారం ఉదయం 6:30 గంటలకు హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక యువతీ యువకులు, విద్యార్థులు మరియు ఉత్సాహవంతులైన ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొని, ర్యాలీని విజయవంతం చేయాలని పోలీస్ ఇన్‌స్పెక్టర్ టి. కరుణాకర్ కోరారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!