Social 1080×1350 • Multi-page
25-10-2026 BREAKING NEWS 11:14 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ టౌన్‌లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ.. -సేవాదళ్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత సందేశం

హుజురాబాద్ టౌన్‌లో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ.. -సేవాదళ్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత సందేశం
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ పిలుపు మేరకు ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ టౌన్ 17వ వార్డులో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హుజురాబాద్ నియోజకవర్గం సేవాదళ్ బ్లాక్-A అధ్యక్షులు మేకల మల్లేశం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

​సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ పిలుపు మేర, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి శ్రీ ఓడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

​ఈ సందర్భంగా సేవాదళ్ బ్లాక్-A ప్రెసిడెంట్ మేకల మల్లేశం మాట్లాడుతూ… “దేశ జాతీయ సార్వభౌమత్వాన్ని, జాతీయ ఐక్యతను ప్రజలందరికీ చాటి చెప్పేందుకే కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం నియమబద్ధంగా జాతీయ జెండాను ఎగరవేయడం జరుగుతోంది” అని తెలిపారు.

​ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కౌన్సిలర్లు: మొహమ్మద్ ఖాళీద్ హుస్సేన్ (17వ వార్డు), బండ వెన్నెల-నవీన్ (16వ వార్డు), బోరగాల మొగిలి (29వ వార్డు), సొల్లు సునిత-బాబు (5వ వార్డు). మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు: మొహమ్మద్ అషు, అలీమ్. వార్డు అధ్యక్షులు: మహమ్మద్ రియాజ్ (16వ వార్డు), మొహమ్మద్ అజ్జు (17వ వార్డు), మహమ్మద్ మొకిద్ (2వ వార్డు), సలీం (22వ వార్డు). సీనియర్ & స్థానిక నాయకులు: కాజీపేట శ్రీనివాస్, నాగమణి-మధుకర్, రాఘవులు, మొహమ్మద్ గౌస్, మహమ్మద్ హబీబ్, మహమ్మద్ ఖాజామియా, మహమ్మద్ ముబారక్, ఆది రెడ్డి, షేక్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!