పోలీసు అమరవీరుల త్యాగాలు అమోఘం: ఏసీపీ మాధవి

–హుజూరాబాద్‌లో వైభవంగా భారీ సైకిల్ ర్యాలీ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : సమాజ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సోమవారం హుజూరాబాద్ పట్టణంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించి అమరులకు ఘన నివాళులర్పించారు.

సైకిల్ ర్యాలీనీ జెండా ఊపి ప్రారంభిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని..

ఈ సైకిల్ ర్యాలీని హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… “ప్రతి ఒక్కరూ యూనిఫాం లేని పోలీసేనని”, ప్రజల రక్షణ కోసం పోలీసులు అందిస్తున్న సేవలు కొనియాడదగినవని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ టౌన్ సీఐ టి. కరుణాకర్, రూరల్ సీఐ వీరబత్తిని శ్రీనివాస్, జమ్మికుంట సీఐలు రామకృష్ణ గౌడ్, పులి వెంకట్ గౌడ్, ఎస్సైలు కొత్తపల్లి రవి, కట్కూరి శేఖర్ రెడ్డి, ఆవుల తిరుపతి, క్రాంతి, స్వాతి, ఏఎస్సై కమల, కౌన్సిలర్లు సొల్లు సునీత, కోయల్ కార్ భారతి, తులసి లక్ష్మణమూర్తిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
