Social 1080×1350 • Multi-page
26-10-2026 BREAKING NEWS 04:57 PM
swarnodayam.com
Telugu Daily News

బాలల భద్రతపై అవగాహనే రక్షణ కవచం! – పోక్సో చట్టంపై విద్యార్థులకు న్యాయ విజ్ఞానం

బాలల భద్రతపై అవగాహనే రక్షణ కవచం!  – పోక్సో చట్టంపై విద్యార్థులకు న్యాయ విజ్ఞానం
IMG-20261026-WA0109

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్‌ : బాలలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టేందుకు విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించాలని రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కె. వీణప్రణతి సూచించారు. సోమవారం పట్టణంలోని కాకతీయ కాలనీలో గల మాంటిస్సోరి ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. పోక్సో చట్టం, మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడా, అసభ్య ప్రవర్తనను గుర్తించడం వంటి అంశాలను వివరించారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక వేధింపులకు పాల్పడినా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడటం శిక్షార్హమని, ఇలాంటి ఘటనలను దాచిపెట్టకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ గీతా షాజు, డైరెక్టర్‌ షాజు థామస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!