Social 1080×1350 • Multi-page
27-10-2026 BREAKING NEWS 07:16 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్ మున్సిపాలిటీలో ప్రజాధనం ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి. -​టెండర్ల నుంచి పండుగ ఖర్చుల వరకు ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి. -​పాలకపక్షం ధనదాహానికి మున్సిపాలిటీ ఏటీఎమ్‌లా మారింది : టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూకట్ల సంతోష్ కుమార్ యాదవ్

హుజూరాబాద్ మున్సిపాలిటీలో ప్రజాధనం ఖర్చుపై సమగ్ర విచారణ జరపాలి. -​టెండర్ల నుంచి పండుగ ఖర్చుల వరకు ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి. -​పాలకపక్షం ధనదాహానికి మున్సిపాలిటీ ఏటీఎమ్‌లా మారింది : టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూకట్ల సంతోష్ కుమార్ యాదవ్
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజూరాబాద్ : హుజూరాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్న ప్రజాధనం దుర్వినియోగం, టెండర్ల ప్రక్రియలోని అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కూకట్ల సంతోష్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.

మంగళవారం హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న కష్టార్జితానికి అధికారులు, పాలకవర్గం సరైన లెక్కలు చూపడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని పాలకవర్గానికి మున్సిపాలిటీ ఒక ఏటీఎమ్‌లా మారిందని ఎద్దేవా చేశారు. ప్రజాధనం దుర్వినియోగమవుతుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ కౌన్సిలర్లు మౌనం వహించడం వెనుక మర్మమేంటని నిలదీశారు.
​విచారణ జరపాల్సిన ప్రధాన అంశాలు:
​రావణాసురుడి విగ్రహం ఎత్తు కొలతలు: దసరా ఉత్సవాల్లో 40 అడుగుల రావణాసురుడి విగ్రహం ఏర్పాటుకు ఒప్పందం చేసుకొని, వాస్తవానికి 30 అడుగుల విగ్రహాన్ని మాత్రమే ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. వర్క్ ఆర్డర్, బిల్లుల వివరాలను బహిర్గతం చేయాలని కోరారు.
​పండుగల ఖర్చులపై నిలదీత: సద్దుల బతుకమ్మ, దసరా, వినాయక నిమజ్జనం వేడుకల పేరుతో లైటింగ్, సౌండ్ సిస్టమ్, ఫ్లెక్సీలకు పెట్టిన ఖర్చుల అంచనాలు, ఒప్పందాల రికార్డులను బహిర్గతం చేయాలన్నారు.
​టెండర్లలో అక్రమాలు: వినాయక నిమజ్జనం పనులను టెండర్ నిబంధనల నుంచి తప్పించుకునేందుకు రూ. 99,000 చొప్పున 9 పనులుగా విడగొట్టడంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
​మున్సిపల్ వాహనాల వినియోగం: కాంట్రాక్టర్ తన సొంత వాహనాలు వాడకుండా మున్సిపాలిటీకి చెందిన జేసీబీలు, డోజర్లను వాడినట్లు ఆరోపణలు ఉన్నాయని, వాహనాల లాగ్‌బుక్స్, డీజిల్ రికార్డులను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు.
​ఈ సందర్భంగా మున్సిపల్ వ్యవహారాలపై నాయకుడు ప్రణవ్ బాబు తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. ఎంతటి ఒత్తిళ్లు వచ్చినా ప్రజాధనాన్ని కాపాడే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.
​ఈ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ నియోజకవర్గ మహిళా నాయకురాలు పొన్నం శిరీష, నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు బండ అశోక్, దిటీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బానోతు వెంకట్ స్వామి నాయక్ గారు, 15వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!