Social 1080×1350 • Multi-page
27-10-2026 BREAKING NEWS 07:30 PM
swarnodayam.com
Telugu Daily News

స్కానింగ్ సెంటర్లను నిబంధనల ప్రకారం నడపాలి. – మాతా శిశు సంరక్షణ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ సనా జివేరియా – హుజురాబాద్ లో స్కానింగ్ సెంటర్ల తనిఖీ

స్కానింగ్ సెంటర్లను నిబంధనల ప్రకారం నడపాలి. – మాతా శిశు సంరక్షణ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ సనా జివేరియా – హుజురాబాద్ లో స్కానింగ్ సెంటర్ల తనిఖీ
IMG-20261027-WA0084

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: స్కానింగ్ సెంటర్ల యజమానులు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వాటిని నడపాలని మాతా శిశు సంరక్షణ జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ సనా జివేరియా అన్నారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని పలు స్కానింగ్ సెంటర్ లను ఆమె హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ప్రభుదాసుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….ప్రతి ఒక్క స్కానింగ్ సెంటర్ రిఫరల్ స్లిప్పులను ఫైల్ చేయాల్సి ఉంటుందన్నారు. స్కానింగ్ సెంటర్ కు చెందిన ఫామ్ ఎఫ్ లను ప్రకారం నడపాలని ప్రతినెలా ఆడిట్ చేయించుకోవాలని అన్నారు. పిసిపి ఎన్ డి టి చట్టాన్ని అమలు పరచాలని గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేసి ఆడ మగ అని చెప్పరాదని ఒకవేళ చెబితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె స్కానింగ్ సెంటర్ల రికార్డులను పరిశీలించి, స్కానింగ్ మిషన్ల పనితీరును ఆమె పరిశీలించారు. ఈ తనిఖీలు ఆమె వెంట పలువురు అధికారులు ఉన్నారు.


@@లోకల్ యాడ్స్@@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బానోతు వెంకట్ స్వామి నాయక్ గారు, 15వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!