Social 1080×1350 • Multi-page
27-10-2026 BREAKING NEWS 07:43 PM
swarnodayam.com
Telugu Daily News

ఈపీఎఫ్ ప్రయోజనాలపై అవగాహన ఉండాలి. -కరీంనగర్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయ సూపరిండెంట్ మాజేటి రమేష్

ఈపీఎఫ్ ప్రయోజనాలపై అవగాహన ఉండాలి. -కరీంనగర్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయ సూపరిండెంట్ మాజేటి రమేష్
IMG-20261027-WA0064

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు ఈపీఎఫ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, వాటిపట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని కరీంనగర్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయ సూపరిండెంట్ మాజేటి రమేష్ అన్నారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని ఆదర్శ విద్యాలయంలో ఉద్యోగులకు ఈ పిఎఫ్ ఫై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఈపీఎఫ్ సభ్యత్వం ఉన్న ఉద్యోగి ఎవరైనా సర్వీసులో మరణిస్తే 2.50 లక్షల రూపాయల నుండి 7 లక్షల రూపాయల వరకు బీమా వస్తుందన్నారు. 10 సంవత్సరాలు ఒక సంస్థలో గాని, వివిధ సంస్థల్లో గాని పనిచేసిన సర్వీసు ఉన్న వారందరూ పెన్షన్ కు అర్హులు అని అన్నారు. ఇంతే కాకుండా ప్రధానమంత్రి నూతనంగా ప్రవేశపెట్టిన పీఎం విబి ఆర్ వై పథకం ద్వారా ప్రవేటు విద్యాసంస్థల్లో పనిచేసే నూతన ఉద్యోగులు ప్రయోజనం పొందవచ్చు అన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి తమ నామినేషన్ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవడం మంచిదన్నారు. 50 సంవత్సరాల వయసు కలిగిన ఉద్యోగులు పింఛన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు ఎలాంటి సందేహాలు ఉన్న కరీంనగర్ ఈపీఎఫ్ కార్యాలయమునకు ఫోన్ ద్వారా గాని స్వయంగా గాని వచ్చి తెలుసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గూడూరు అనిల్, కరస్పాండెంట్ పి కిరణ్ కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బానోతు వెంకట్ స్వామి నాయక్ గారు, 15వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!