అన్ని దానాల్లోకెల్లా రక్త దానం గొప్పది. – హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి, చైర్ పర్సన్ సుహాసిని.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : అన్ని దానాల్లో కన్నా మనిషి ప్రాణాలను నిలబెట్టే రక్త దానం గొప్పదని హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి అన్నారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని విఎల్ఆర్ గార్డెన్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని రక్తదాన శిబిరం జరిగింది. రక్తదాన శిబిరాన్ని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఏసీపీ మాధవి మాట్లాడుతూ…దేశ రక్షణ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు అమూల్యమైనవని, వారి త్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు. ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడే క్రమంలో తమ కుటుంబాలను సైతం వదిలి, కంటిమీద
కునుకు లేకుండా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన మహనీయులు మన పోలీస్ అమరవీరులని కొనియాడారు. చైర్ పర్సన్ సుహాసిని మాట్లాడుతూ… సమాజంలో ప్రతి ఒక్కరూ ఏలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవిస్తున్నారంటే దానికి పోలీసు అధికారులు, సిబ్బంది అహర్నిశలు చేస్తున్న శ్రమే కారణమని అన్నారు. ప్రజల రక్షణ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తూ, శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీస్ వ్యవస్థ పనితీరు గొప్పదని అన్నారు. ఆపదలో ఉన్న ఒక ప్రాణాన్ని నిలబెట్టే రక్తదానం చేయడం ద్వారా అమరవీరుల స్మృతికి సార్థకత చేకూరుతుందని, యువత పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని ఆమె తెలిపారు. ఈ శిబిరంలో 83 మంది రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐలు టి కరుణాకర్, వీరబత్తిని శ్రీనివాస్, సుదగోని రామకృష్ణగౌడ్, పులి వెంకట్ గౌడ్, ఎస్సైలు కొత్తపల్లి రవి, కృష్ణారావు, కే శేఖర్ రెడ్డి, తిరుపతి, క్రాంతి, స్వాతి, వైద్య బృందం సభ్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, సుజాత, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మార్నింగ్ వాకర్స్ ఫ్రెండ్స్ పాల్గొన్నారు.
*లోకల్ యాడ్స్*
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బానోతు వెంకట్ స్వామి నాయక్ గారు, 15వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్.
