నాగార్జున డెయిరీలో ఉచిత వైద్య శిబిరంకు చక్కని స్పందన.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : స్థానిక నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ డెయిరీలో మంగళవారం ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎన్.రమేష్ ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులందరికీ వివిధ రకాల వైద్య పరీక్షలు చేపట్టారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పుల్లూరి ప్రభాకర్ రావు సూచనల మేరకు పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా ఔషధాలు అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. డెయిరీ రంగంలో పనిచేసే వారు వ్యక్తిగత శుభ్రతను విధిగా పాటించాలని సూచించారు. రోజూ వ్యాయామం, నడక, ధ్యానం అలవర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. అనంతరం సిబ్బందితో ఆరోగ్య జీవన విధానంపై సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుధాకర్ ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ పుల్లూరి గణేష్ రావు, సీఈవో కృష్ణప్రసాద్, ప్లాంట్ మేనేజర్ మాటూరి శ్రీనివాస్, ప్రతినిధులు సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ బానోతు వెంకట్ స్వామి నాయక్ గారు, 15వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్.
