హుజూరాబాద్‌లో అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం : కేసు నమోదు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : హుజూరాబాద్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని ‘హనుమాన్ క్రషర్’ వద్ద అక్రమంగా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) వి. శ్రీనివాసరావు తమ సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించినట్లు టౌన్ సిఐ టి కరుణాకర్ తెలిపారు.
ఈ తనిఖీల్లో రిజిస్ట్రేషన్ నంబర్ లేని ఒక కంప్రెసర్ ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని, దానిలో అక్రమంగా తరలిస్తున్న 99 జిలెటిన్ స్టిక్స్, అలాగే పేలుడుకు ఉపయోగించే వైర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు.
ఈ ఘటనకు సంబంధించి హుజూరాబాద్‌లోని రంగనాయకుల గుట్ట ప్రాంతానికి చెందిన సంపంగి రవి (42), తండ్రి మల్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, హనుమాన్ క్రషర్ యజమాని ఘన్నారపు లక్ష్మీనారాయణే తనకు ఈ పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్లు విచారణలో నిందితుడు వెల్లడించాడు.
ఈ అక్రమ రవాణా మరియు నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ జరుపుతున్న అంశంపై హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ ఇల్లందుల సమ్మయ్య గారు, తొమ్మిదవ వార్డు కౌన్సిలర్, (ధమ్మక్కపేట) హుజురాబాద్ పురపాలక సంఘం.
