Social 1080×1350 • Multi-page
28-10-2026 BREAKING NEWS 09:04 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ లో అంబేద్కర్ సాక్షి ప్రజా సంఘాల నిరసన

హుజురాబాద్ లో అంబేద్కర్ సాక్షి ప్రజా సంఘాల నిరసన
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై మరెవరు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయరాదని కోరుతూ బుధవారం సాయంత్రం ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ను, సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహనీయులను కించపరిచే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు. అనిచిత వ్యాఖ్యలు చేసిన ఓ నాయకుడు బహిరంగ క్షమాపణలు చెప్పాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రుద్రారపు రామచంద్రం, వేల్పుల ప్రభాకర్‌, కోలిపాక సమ్మయ్య, తునికి సమ్మయ్య, సంజీవ్‌ , బాబర్, తదితరులు పాల్గొన్నారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ ఇల్లందుల సమ్మయ్య గారు, తొమ్మిదవ వార్డు కౌన్సిలర్, (ధమ్మక్కపేట) హుజురాబాద్ పురపాలక సంఘం.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!