MJP పాఠశాలను సందర్శించిన హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు శుక్రవారం కేసీ (KC) క్యాంపులోని మహాత్మా జ్యోతిబా పూలే (MJP) బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె పాఠశాలలోని తరగతి గదులు, వసతులను పరిశీలించి విద్యార్థినులతో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. వారి బాగోగులు, అందిస్తున్న విద్యా సదుపాయాలు, రోజువారీ భోజన నాణ్యత మరియు ఎదుర్కొంటున్న సమస్యల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.



ఈ సందర్భంగా చైర్పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ… విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం, నాణ్యమైన వసతులు కల్పించడమే తమ ప్రాధాన్యతని తెలిపారు. పాఠశాలలో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి, విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సొల్లు సునీత బాబు, తాళ్లపెళ్లి రమేష్, బండ వెన్నెల నవీన్, బోరగాల మొగిలి, మహమ్మద్ ఖలీద్ హుస్సేన్, సందమల్ల పుణ్య బాబు, జున్నోజు భాస్కర్, మేకల స్వరూప తిరుపతి, కో-ఆప్షన్ సభ్యులు గొట్టే జమదగ్నితో పాటు పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ బండ వెన్నెల నవీన్ గారు, 16వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్.
