బాలల భద్రతకు చట్టాలపై అవగాహనే రక్షణ కవచం.. – న్యాయ విజ్ఞాన సదస్సుల్లో సీనియర్ సివిల్ జడ్జ్ పి.బి కిరణ్ కుమార్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బాలలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడంతో పాటు, వారి హక్కులకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుల్లో సీనియర్ సివిల్ జడ్జ్ పి.బి కిరణ్ కుమార్ హుజురాబాద్ చట్టం పైన అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరిస్తూ, మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాలను, అసభ్య ప్రవర్తనను గుర్తించే విధానాలను విద్యార్థులకు వివరించారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక వేధింపులకు పాల్పడినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడటం చట్టరీత్యా శిక్షార్హమని, ఇలాంటి ఘటనలను దాచిపెట్టకుండా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి తన హక్కులను తెలుసుకోవడంతో పాటు వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, అపరిచిత వ్యక్తులతో ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని తెలిపారు. బాలలపై లైంగిక నేరాలను నిరోధించేందుకు, బాధిత బాలబాలికలకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు పోక్సో చట్టం అమలులో ఉందని వివరించారు.
పిల్లల భద్రత కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదని, పాఠశాలలు, ఉపాధ్యాయులు, సమాజం కూడా సమష్టిగా బాధ్యత తీసుకోవాలని అన్నారు. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు, చట్టాలపై అవగాహన పెంపొందించడం ద్వారా బాలల హక్కులను సమర్థవంతంగా పరిరక్షించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ బండ వెన్నెల నవీన్ గారు, 16వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్.
