జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా జనగణన

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్ : వచ్చే ఏడాది జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా జనగణన (Population Census) చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, మంచు తీవ్రత ఉండే ప్రాంతాలు మినహా అన్ని రాష్ట్రాల్లో ఫిబ్రవరి 28 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవాలతోపాటు లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్‌లోని మంచు తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జనగణన (Census 2027) ఉండదని పేర్కొంది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది.


జనగణనకు రిఫరెన్స్ తేదీగా 2027 మార్చి 1ని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మార్చి ఒకటి నుంచి ఐదో తేదీ వరకు సవరణల కోసం సమయం ఇచ్చారు. ప్రజలు స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునేందుకు జనవరి 10 నుంచి జనవరి 24 వరకు వీలు కల్పించారు. ఆన్‌లైన్ లేదా నిర్దేశిత విధానంలో ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. అనంతరం జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరించనున్నారు.
##లోకల్ యాడ్స్##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ బండ వెన్నెల నవీన్ గారు 16వ వార్డు కౌన్సిలర్, పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్.
