Social 1080×1350 • Multi-page
31-10-2026 BREAKING NEWS 06:56 PM
swarnodayam.com
Telugu Daily News

పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా బూత్ అధ్యక్షుల నియామకం.. -నవంబర్ 5న నిర్వహించే మహా పాదయాత్రను విజయవంతం చేయాలి : బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు

పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా బూత్ అధ్యక్షుల నియామకం.. -నవంబర్ 5న నిర్వహించే మహా పాదయాత్రను విజయవంతం చేయాలి : బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు
IMG-20261031-WA0093

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా హుజూరాబాద్ పట్టణంలోని 29, 47, 63వ బూత్‌లకు అధ్యక్షులను నియమించినట్లు బీజేపీ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు తెలిపారు. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో 29వ బూత్ అధ్యక్షుడిగా బెజ్జంకి రాజేందర్, 47వ బూత్ అధ్యక్షుడిగా పల్లెపు భాస్కర్, 63వ బూత్ అధ్యక్షుడిగా డొరి ఐలయ్యలను నియమించారు.

ఈ సందర్భంగా తూర్పాటి రాజు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కమిటీలే పునాదులని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రతి బూత్‌లో పార్టీని బలోపేతం చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నూతనంగా నియమితులైన బూత్ అధ్యక్షులకు పిలుపునిచ్చారు.

నవంబర్ 5న కరీంనగర్‌లో మహా పాదయాత్రను విజయవంతం చేయాలి.

నవంబర్ 5వ తేదీన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని తూర్పాటి రాజు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల హక్కుల కోసం జరిగే ఈ కార్యక్రమంలో యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

“ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం – అరాచకత్వాన్ని తరిమికొడదాం” అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశ సమగ్రత, భద్రత, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా ప్రజలంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.

నవంబర్ 5న జరిగే మహా పాదయాత్ర ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజల్లో చైతన్యం నింపడానికి ఒక వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. హుజూరాబాద్ పట్టణం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత అధిక సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్‌చార్జి యాళ్ల సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శులు గంట సంపత్, తిప్పబత్తిని రాజు, సీనియర్ నాయకులు అంకతి వాసు, పట్టణ కార్యవర్గ సభ్యులు డి. అశోక్, బెజ్జంకి రాజేందర్, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!