Social 1080×1350 • Multi-page
31-10-2026 BREAKING NEWS 11:21 PM
swarnodayam.com
Telugu Daily News

ఎంఐఎం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని ఆత్మీయంగా సన్మానించిన ముజాహిద్ హుస్సేన్

ఎంఐఎం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని ఆత్మీయంగా సన్మానించిన ముజాహిద్ హుస్సేన్
IMG-20261031-WA0126

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ : ఎంఐఎం పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఎంఐఎం పార్టీ జిల్లా కార్యాలయంలో హుజురాబాద్ ముస్లిం మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆత్మీయంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గులాం అహ్మద్ హుస్సేన్ ముస్లింల సమస్యలపై, వక్ఫ్ బోర్డు కు సంబంధించిన పలు అంశాలపై అలుపెరగని, గొంతుకగా సేవలు అందించాలని కోరారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రభుత్వానికి ముస్లింల సమస్యలను నివేదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జమియతుల్ ఉలైమా హుజురాబాద్ అధ్యక్షుడు హాఫిజ్ ఇమ్రాన్ బేగ్, తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Mandala Yadagiri

    Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!